Beauty Tips

Pink Lips:కలబందతో ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Black lips to pink lips Home remedies : పెదాలు నల్లగా లేకుండా గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి. అయితే ఆహారపు అలవాట్లు., ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.
Dry lips beauty tips
అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.
amudam
రాత్రి పడుకోవటానికి ముందు ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయం పెదాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే నల్లగా మారిన పెదాలు మరియు పగిలిన పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద ఉంటే సరిపోతుంది.
badam oil Skin Benefits
ఆముదం,బాదం నూనె,కలబంద పగిలిన పెదాలను మృదువుగా చేయటానికి నల్లగా మారిన పెదాలను గులాబీ రంగులోకి మార్చటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా నల్లగా మారిన పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com