Healthhealth tips in telugu

పరగడుపున వీటిని ఇలా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు అసలు ఉండవు…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Joint Pains Home Remedies In Telugu : కొంచెం పని చేసినా త్వరగా అలసిపోవడం, ఎముకలు పేలుసుగా మారటం, కీళ్ళల్లో నొప్పులు ఉండటం, కూర్చుని లేవటం కష్టం అవటం వంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. శీతాకాలంలో నొప్పులు అనేవి సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పులు కారణంగా రోజువారి పనులు కూడా కష్టం అవుతాయి.

కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువగా మందులను వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల calcium సమృద్దిగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. సాధారణంగా 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లో calcium లోపం కనబడుతుంది.

ఒక బౌల్ లో 5 బాదం పప్పులు, ఒక స్పూన్ నువ్వులను వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం తినాలి. బాదం పప్పు తొక్కను తీసి తినాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం తింటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నువ్వులలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలను, కీళ్ళను దృఢంగా ఉండేలా చేసి బలహీనం కాకుండా కాపాడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన నొప్పులను,వాపులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇక బాదం విషయానికి వస్తే calcium సమృద్దిగా ఉంటుంది.
Diabetes patients eat almonds In Telugu
ఎముకల ఆరోగ్యం మెరుపరచడం ద్వారా ఎముకల ద్రవ్యరాశి మరియు సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఎముక కణాలు విచ్చిన్నం కాకుండా నిరోధిస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకల సమస్యలను తగ్గించటమే కాకుండా రాకుండా కూడా కాపాడుతుంది. 35 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజు నువ్వులు,బాదం పప్పు తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.