డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తింటే ఏమి అవుతుందో తెలుసా ?
Diabetes eat pineapple : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. చాలామందికి ఫ్రూట్స్ తింటే మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను తక్కువ .మోతాదులో తీసుకోవచ్చు.
ఇక ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తింటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎంజైమ్స్,ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉండవటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే కడుపులో మంట ఏమైనా ఉంటే తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పైనాపిల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ 51 నుంచి 73 మధ్యలో ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరులో కూడా తేడాలు వస్తాయి. వీటి కారణంగా కిడ్నీలు, గుండె వంటి వాటిపై ప్రభావం పడుతుంది.
పైనాపిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. అంటే 100 గ్రాముల కంటే ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పైనాపిల్‌లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే చక్కెర శోషణ నిదానంగా జరుగుతుంది.
ప్రేగు కదలికలు మెరుగ్గా మారుతాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గించి బరువుని కంట్రోల్ చేస్తాయి. దీనిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన ఈ సీజన్ లో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.