1 గ్లాస్ రక్తహీనతను తగ్గించటమే కాకుండా అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా చేస్తుంది
Anemia Best Drink : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా రక్తహీనత (Anemia) సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. రక్తహీనత సమస్యను అశ్రద్ధ చేయకుండా వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి.
రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డ్రింక్ తీసుకోవటం వలన నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి ఏమీ లేకుండా హుషారుగా ఉంటారు. ఒక బౌల్ లో ఒక స్పూను సన్ ఫ్లవర్ గింజలు, ఒక స్పూను పుచ్చ గింజలు, ఒక స్పూను గుమ్మడి గింజలు, నాలుగు బాదం పప్పులు, రెండు డ్రై అంజీర్ వేయాలి.
ఆ తర్వాత 2 వాల్ నట్స్, నాలుగు గింజలు తీసిన ఖర్జూరాలు, నాలుగు ఎండు ద్రాక్షలు, ఒక స్పూన్ చియా సీడ్స్, అర స్పూన్ అవిసె గింజలు వేసి నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నానబెట్టిన వీటిని మిక్సీ జార్ లో నీటితో సహా వేసి మిక్సీ చేయాలి. బాదం పప్పు తొక్క తీసి వేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలు, రెండు స్పూన్ల తేనె వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాస్ లో పోస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన డ్రింక్ సిద్ధం అయినట్టే.
ఈ డ్రింక్ ని ప్రతి రోజు 15 రోజుల పాటు తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి ఏమి ఉండవు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాస్త శ్రద్ద,ఓపికగా ఇలా ఇంటిలో తయారుచేసుకొని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్య నుండి బయట పడవచ్చు.
ఈ డ్రింక్ లో తీసుకున్న అన్నీ రకాల డ్రై ఫ్రూట్స్ Online Stores లేదా డ్రై ఫ్రూట్స్ షాప్ లలో విరివిగానే లభ్యం అవుతున్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించి డ్రింక్ తయారుచేసుకొని తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ డ్రింక్ ని చిన్న పిల్లలకు ప్రతి రోజు ఇస్తే చాలా హుషారుగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.