భోజనం అయ్యాక తమలపాకులో మూడు మిరియాల గింజలను పెట్టి నమిలితే ఏమి జరుగుతుందో తెలుసా?
Chew betel leaves with Black pepper : అధిక బరువును తగ్గించుకోవటానికి తమలపాకు,మిరియాలు చాలా బాగా సహాయపడతాయి. అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి వేలకొద్ది దబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు.
పూర్వకాలంలో భోజనం చేసిన తర్వాత తమలపాకులు తినేవారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని అలా తమలపాకును తినేవారు. ఆయుర్వేద వైధ్య నిపుణులు తమలపాకు,మిరియాలు కలిపి తింటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్పుతున్నారు.
తమలపాకులు మన శరీరంలోని జీర్ణ శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. తమలపాకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయని ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడింది. మన శరీరం యొక్క జీవక్రియ రేటును పెంచటమే కాకుండా కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్‌ను తటస్థీకరిస్తుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు.
మిరియాలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు, పెప్పరిన్ అనేవి శరీరంలోని కొవ్వు పదార్థాలను తగ్గించి, మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తాయి. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి మనం తినే ఆహారం కడుపులో బాగా జీర్ణం చేస్తుంది. శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది.
తాజా తమలపాకులో మూడు మిరియాలను పెట్టి ఆకును మడిచి నోటిలో పెట్టుకుని నమలాలి. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇలా చేస్తే మీ శరీరంలోని జీర్ణశక్తి పెరుగుతుంది. దాదాపుగా రెండు నెలలలో బరువు తగ్గుతారు. పచ్చిగా మరియు తాజాగా ఉన్న తమలపాకును మాత్రమే ఉపయోగించాలి. అలాగే తమలపాకులపై నల్లటి మచ్చలు ఉంటే తినకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.