వారంలో 1 సారి ఈ Dosa తింటే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఆరోగ్యంగా ఉంటారు
Full Strength Dosa : ఈ రోజుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారం తినాలని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజు నాలుగు రకాల పప్పులతో Dosa తయారుచేసుకుందాం. ఈ Dosa లో చాలా పోషకాలు ఉంటాయి.
ఒక గిన్నెలో కందిపప్పు ఒక కప్పు, పొట్టు తీయని మినపప్పు 1 కప్పు,పచ్చి శనగ పప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు వేసి నీటిని పోసి ఆరు గంటల పాటు నానబెట్టాలి. బాగా నానిన ఈ పప్పును శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో రెండు స్పూన్ల నిమ్మరసం పిండాలి. ఈ పిండిని నాన్ స్టిక్ పెనం మీద Dosa లా వేసి…ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం తురుము,కొత్తిమీర,క్యారెట్ తురుము జల్లాలి.
ఈ Dosa లను నూనె లేకుండా వేసుకోవచ్చు. అవసరం అయితే మీగడ వేసి dosa లను వేసుకోవచ్చు. ఇక్కడ ఈ dosa లో నూనె ఉపయోగించ లేదు.అలాగే ఉప్పును కూడా ఉపయోగించలేదు. ఈ Dosa లను వేడిగా తింటే చాలా బాగుంటాయి. ఈ Dosa కు ఉపయోగించిన పప్పులలో 20 నుంచి 25 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ప్రోటీన్ కూడా చాలా సమృద్దిగా ఉంటుంది.
ఈ Dosa ను వారంలో రెండు సార్లు తింటే శరీరానికి అవసరమైన బలం వస్తుంది. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు. పిల్లలకు ఈ Dosa లను పెడితే చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.