1 గ్లాస్ అల్లం పాలు తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు…ఈ సీజన్ లో…
Health benefits of ginger milk : ఒక గ్లాసు గోరువెచ్చని పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో అల్లం కలిపి తాగితే ఈ సీజన్ లో వచ్చే అలెర్జీలు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు మినరల్స్ సమృద్దిగా ఉంటాయి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ అల్లం తురుము వేసి 5 నిమిషాలు మరిగించి ఒక స్పూన్ బెల్లం వేసి రెండు నిమిషాలు మరిగించి వడకట్టి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను రాత్రి పడుకొనే ముందు తాగితే ఎక్కువ ప్రయోజనం కనపడుతుంది.
ఈ పాలను తాగితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరం నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే చల్లగా ఉండే ఈ సీజన్ లో శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి సహాయపడుతుంది. అల్లం పాలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అల్లం పాలను తాగితే జీర్ణ సంబంద సమస్యలు ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి,కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. పాలలో కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నందున ఎముకల బలహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే అల్లం ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ మొదలైన వాటి వల్ల ఎముక అలసటను తగ్గిస్తుంది. 40 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా అల్లం పాలను తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ నుండి ఉపశమనం పొందవచ్చు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కండరాల నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది.
జలుబు, ఫ్లూ మరియు దగ్గు, తరచుగా గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వంటి వాటి నుండి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండుట వలన నొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఈ సీజన్ లో అల్లం పాలను తాగితే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.