Beauty Tips

Dandruff:ఈ ఆకుకూరతో ఇలా చేస్తే చుండ్రు,దురదలువంటివి అన్ని మాయం అవుతాయి

Dandruff Home Remedies In Telugu : ఈ చలికాలంలో ఆకుకూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి. అలాంటి అఆకుకురాల్లో మెంతి కూర ఒకటి. మెంతి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అలాగే జుట్టు సమస్యలకు చెక్ పెట్టె పోషకాలు కూడా చాలా సమృద్దిగా ఉన్నాయి.

జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి మెంతి ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది. చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకా నిరాశకు గురి అవుతూ ఉంటారు.

చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. చుండ్రు తగ్గించుకోవడానికి వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంత మంది చుండ్రును తగ్గించుకోవటానికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ కాలంలో మెంతికూర చాలా విరివిగా లభ్యమవుతుంది. మెంతి కూరను తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల మెంతికూర పేస్టు, ఒక స్పూన్ గోరింటాకు పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆముదం, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిసేలాగా కలపాలి.
curd benefits in telugu
ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు, తలలో దురద, ఇన్ ఫెక్షన్ వంటివి ఏమి లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి.

ఈ రెమిడీ కోసం ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే అన్నీ సులువుగా అందుబాటులో ఉండేవే. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. తప్పకుండ ఈ చిట్కాను ట్రై చేయండి.

ఈ చిట్కాలో మెంతికూర, గోరింటాకు పొడి, పెరుగు, ఆముదం, నిమ్మరసంలలో ఉన్న పోషకాలు చుండ్రు మరియు చుండ్రుకు కారణం అయినా కారకాలను నిర్ములిస్తుంది. జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక ఒక కారణం. జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా ఆరోగ్యంగా పెరగటానికి ఏఎ చిట్కా సహాయపడుతుంది.

మెంతి కూరలో ఉన్న పోషకాలు జుట్టు లోపలి నుంచి మేలు చేస్తుంది. మెంతి ఆకుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు రాల‌డాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u