Kidney Health: కిడ్నీల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఇలా బయటకు పంపండి.. కిడ్నీలను క్లీన్ చేసుకోండి..!
Kidney clean remedies : రక్తం నుండి వ్యర్ధాలను బయటకు పంపే సామర్ధ్యం కిడ్నీలకు తగ్గినప్పుడు కిడ్నీకి సంబందించిన సమస్యలు వస్తాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొంతమేర సమస్య నుంచి బయట పడవచ్చు.
క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీలను శుభ్రపరచటానికి మరియు కిడ్నీలో రాళ్ళను కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కిడ్నీలో వ్యర్ధాలను బయటకు పంపుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను అశ్రద్ద చేస్తే…ఆ బాక్టీరియా కిడ్నీలకు చేరి కిడ్నీ సమస్యలకు కారణం అవుతుంది.
వెల్లుల్లి కిడ్నీలలో వ్యర్ధాలను బయటకు పంపి కిడ్నీలను శుభ్రం చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. పచ్చి వెల్లుల్లి తినవచ్చు. అలా తినలేని వారు వెల్లుల్లిని దంచి నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఇది కణాలు ,మూత్రాశయాన్ని వేగంగా ఫ్లష్ చేయడంలో సహాయపడుతుంది.
అల్లం రసం కిడ్నీలను శుభ్రం చేయటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అల్లం రసం కిడ్నీలలో మలినాలను తొలగిస్తుంది. అయితే అల్లంను రసంగా తీసుకోవచ్చు…లేదంటే చిన్న అల్లం ముక్కను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. అయితే టీలో అల్లం వేసుకొని తాగితే ప్రయోజనం ఉండదు.
నిమ్మరసం కిడ్నీల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. నిమ్మలో ఉండే సిట్రేట్ కిడ్నీల నుండి కాల్షియంను బయటకు పంపుతుంది. నిమ్మకాయ కిడ్నీలను శుభ్రంగా ఉంచటం, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేయటం మరియు యూరిన్ ఇన్ ఫెక్షన్ రాకుండా చేసి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.