Healthhealth tips in telugu

Thyroid:ఈ గింజలను ఇలా చేసి తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య మాయం అవుతుంది

Thyroid reduced food In telugu :ఈ మధ్య కాలంలో మీరు బరువు పెరిగినా, బాగా నీరసంగా ఉంటున్నా, చలిగా, స్కిన్ డ్రై అయిపోయి ఉంటున్నా, కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నా, జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతో పాటు కాన్సంట్రేట్ చేయలేకపోతున్నా మీరు ఒక సారి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది, అని చెబుతున్నారు నిపుణులు.

ఇటీవల కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. .
Thyroid remedies
అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట., నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు జింక్, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలేనియం వంటి పోషకాలు అవసరం.

ఈ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పెసలను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెసలను నానబెట్టి తీసుకోవచ్చు…లేదంటే మొలకలుగా తీసుకోవచ్చు. పెసలు త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, మినరల్స్ అందించడంతో పాటు థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
green gram benefits in telugu
థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దాన్ని మెరుగు పరిచేందుకు పెసలు సహకరిస్తాయి. పెసలలో అయోడిన్ ఉండుట వలన థైరాయిడ్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. పెసలలో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నవారికి పెసలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు తగినంత నీరు తాగాలి. అలాగే తగినంత నిద్ర ఉండాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా థైరాయిడ్‌ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ…ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. అప్పుడే థైరాయిడ్‌ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే థైరాయిడ్‌ ఉన్నవారు డాక్టర్ సూచన ప్రకారం తప్పనిసరిగా మందులు వాడాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ