తక్కువ ఖర్చులో రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా చేస్తాయి
Iron Rich Foods : ఈ మధ్య కాలంలో మనలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య వచ్చినప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది. అందువలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ అలసట,నీరసం,తలనొప్పి వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా తొందరగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవాలి. సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను కూడా పాటించాలి.
ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి. తోటకూరలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తోటకూరను వారంలో రెండుసార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే…తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అలాగే ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతుంది.
అందరికి అందుబాటు ధరలో ఉండే ఎండు ద్రాక్షలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు కాపర్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దాంతో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. ప్రతి రోజు 5 ఎండు ద్రాక్షను తీసుకుంటే సరిపోతుంది.
నువ్వులను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. నువ్వులలో చాలా పోషకాలు ఉంటాయి. నువ్వులలో ఐరన్, ఫోలేట్, కాపర్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. నువ్వులలో బెల్లం కలిపి తీసుకుంటే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.