Beauty Tips

Dandruff Remedies:మిరియాలతో ఇలా చేస్తే వేలకు వేలు ఖర్చు పెట్టిన తగ్గని చుండ్రు శాశ్వతంగా తొలగిపోతుంది

Dandruff Home remedies In telugu : తలలో విపరీతమైన దురద, చుండ్రు, ఇరిటేషన్, మొటిమలు, జుట్టు రాలే సమస్య వంటివి విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి ఒక్కసారి వచ్చాయంటే తగ్గటం చాలా కష్టం. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చాలా విసిగి పోయి ఉంటారు.

అలాంటి వారికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చుండ్రు తగ్గించుకోవడానికి మిరియాలు చాలా బాగా సహాయపడతాయి. ఈ రెమిడీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ మిరియాలు వేసి వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల ఉసిరికాయ పొడి వేసుకోవాలి.

ఆ తర్వాత మిరియాల పొడి, అర చెక్క నిమ్మరసం, మూడు స్పూన్ల పెరుగు వేసి అన్ని బాగా కలిసే వరకు కలపాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి అలాగే చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

నల్ల మిరియాలలో ఉండే విటమిన్ సి జుట్టును శుభ్రపరచడంలో మరియు స్కాల్ప్ నుండి మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా మిరియాలు బాగా సహాయపడతాయి.

ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన హెయిర్ ఫోలికల్స్‌కు పోషణను అందించి జుట్టును బలపరుస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు,దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే నిమ్మరసం, పెరుగులో ఉన్న పోషకాలు కూడా చుండ్రు సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.