ఈ ఆకుతో ఇలా చేసుకొని తింటే కాల్షియం లోపం జీవితంలో ఉండదు…మరెన్నో ప్రయోజనాలు…
Munagaku benefits In Telugu : ఈ మధ్య కాలంలో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చే సరికి కాల్షియం లోపం కనపడుతుంది. కాల్షియం లోపం లేకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మనకు చాలా సులభంగా దొరికే మునగాకును రెగ్యులర్ గా వాడితే కాల్షియం లోపం తగ్గటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మునగాకుతో పప్పు,పొడి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా పచ్చడి చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, అరస్పూన్ ఆవాలు, అరస్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల వేరుశనగ పప్పు, కొంచెం కరివేపాకు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టాలి.
అదే పాన్ లో ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక రెండు కప్పుల మునగాకు వేసి వేగనివ్వాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న మిశ్రమంను మిక్సీ చేసి..ఆ తర్వాత మునగాకు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం,కొంచెం పసుపు వేసి మరొకసారి మిక్సీ చేస్తే మునగాకు పచ్చడి రెడీ.
ఒక పాన్ లో ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ మెంతులు,అరస్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అరస్పూన్ మినపప్పు, చిటికెడు ఇంగువ వేసి వేగించి పచ్చడిలో కలపాలి. ఈ మునగాకు పచ్చడిని వారంలో రెండు సార్లు తినే విధంగా ప్రణాళిక వేసుకోవాలి.
ఈ పచ్చడి తినటం వలన మన శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఉండవు. అలాగే విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.