రోజుకి అరస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే…ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు…
olive Oil benefits In Telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పురాతన కాలం నుండి వాడుతున్న ఆలివ్ నూనెను ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఆలివ్ పండ్ల నుండి ఆలివ్ ఆయిల్ ని తయారు చేస్తారు.
చాలామందికి ఆలివ్ ఆయిల్ గురించి తెలియక పెద్దగా వాడటానికి ఆసక్తి చూపరు. అయితే వీటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా వాడటానికి ప్రయత్నం చేస్తారు. ప్రతిరోజు అర స్పూను ఆలివ్ ఆయిల్ ని సలాడ్స్ లేదా మనం చేసుకునే కూరల్లో వేసుకోవడం ద్వారా తీసుకుంటే సరిపోతుంది.
ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ కె, విటమిన్ ఇ, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ
ఆయిల్ ని రెగ్యులర్ గా తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరిగి రక్త సరఫరా ఏ అడ్డంకులు లేకుండా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఏమీ ఉండవు.
మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల నొప్పి, కీళ్లనొప్పి వంటి వాటిని తగ్గించడంలో చాలా సమర్ధ వంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ లో calcium చాలా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో calcium లోపాన్ని తగ్గిస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. అటువంటి వారు కూడా ఆలివ్ ఆయిల్ ని వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు సమస్య, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించి శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ధర కాస్త ఎక్కువైన దానికి తగ్గట్టుగానే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఆలివ్ ఆయిల్ వాడటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.