ఈ అటుకులను ఎప్పుడైనా తిన్నారా…ఇలా తింటే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
Pearl millet flakes Benefits in telugu : చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జలలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సజ్జలు పిండి,రవ్వ రూపంలో…అలాగే సజ్జలతో అన్నం వండి తింటూ ఉంటారు. సజ్జలు అటుకుల రూపంలో కూడా లభ్యం అవుతున్నాయి. సజ్జ అటుకులను తినటం వలన చాలా తేలికగా జీర్ణం అవుతాయి.
సజ్జ అటుకులను తింటే కలిగే లాభాలను తెలుసుకుందాం. వీటిల్లో ప్రోటీన్, డైటరీ ఫైబర్, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం,Calcium,
మెగ్నీషియం,పోలేట్,విటమిన్ A,B1,B2,B3 వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. సజ్జ అటుకుల్లో మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు తగ్గించటమే కాకుండా శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కలిగి ఉంది. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఇన్సులిన్ ప్రతిస్పందనను తగ్గిస్తాయి.అలాగే శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (LDL) స్థాయిలను మెరుగుపరుస్తాయి.
సజ్జ అటుకుల్లో ఐరన్ మరియు జింక్ ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఇవి పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ అటుకుల్లో ఉండే కరగని ఫైబర్ కంటెంట్ మన వ్యవస్థలో అధిక పిత్త ఉత్పత్తిని తగ్గిస్తుంది.
మన ప్రేగులలో అధిక మొత్తంలో పిత్త స్రావం తరచుగా పిత్తాశయ రాళ్ల పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. ఫైబర్ ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గే ప్రణాళికలో ఉండే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. సజ్జలలో అమైనో ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి. అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది.
ఈ అటుకులను వేగించి ఉప్పు, కారం జల్లుకొని తినవచ్చు…లేదంటే పాలల్లో నానబెట్టి తినవచ్చు. లేదంటే ఈ అటుకుల్లో ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నిమ్మరసం కలిపి తినవచ్చు. వీటిని ఏ రూపంలో తిన్న వీటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.