White Hair:ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య నుండి తెల్లజుట్టు సమస్య వరకు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు
white hair Home Remedies in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జుట్టు రాలే సమస్య, జుట్టు పొడిగా మారటం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది కంగారుపడి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను వాడేస్తూ ఉంటారు. .
అలా కాకుండా ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ రెమిడీ ఎలా చేసుకోవాలి..ఎలా ఉపయోగించాలి… అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఒక కలబంద ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి జెల్ తీసుకోవాలి.
ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకుని ఒక పల్చని వస్త్రం సాయంతో కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. ఒక బౌల్లో నాలుగు స్పూన్ల అలోవెరా జెల్, నాలుగు స్పూన్ల కొబ్బరిపాలు, రెండు స్పూన్ల ఉసిరి పొడి, అరస్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమంను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, పొడి జుట్టు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అంతేకాకుండా ఈ రెమిడీ ఫాలో అవటంవల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. ఈ రెమిడిలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన అన్నీ సమస్యలను తగ్గిస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి ఈ రెమిడిని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.