1 లడ్డు తింటే చాలు అధిక బరువు,రక్తహీనత,నీరసం,జుట్టు రాలే సమస్య,నొప్పులు ఉండవు
protein laddu In Telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటేనే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఈ. రోజుల్లో రక్తహీనత, అధిక బరువు, జుట్టు రాలే సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. .
ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మనం చాలా సులభంగా మన ఇంటిలోనే ఒక లడ్డు తయారు చేసుకుని ప్రతిరోజు ఒకటి తింటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు బాదంపప్పు డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఒక కప్పు వాల్నట్స్, ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు అవిసె గింజలు వరుసగా అన్నింటిని డ్రై రోస్ట్ చేయాలి. .
ఒక కప్పు ఖర్జూరం తీసుకుని గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. 100 గ్రాముల బెల్లం కూడా తీసుకోవాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న బాదంపప్పు, వాల్ నట్స్, నువ్వులు, అవిసె గింజలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం వేసి నీటిని పోసి తీగ పాకం వచ్చేదాకా కలుపుకోవాలి. .
ఆ తర్వాత బెల్లం పాకంలో ఖర్జూరం పేస్ట్, తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డులు మాదిరిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి దాదాపుగా 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
ఈ లడ్డులో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మన సరిర్తనికి అంది అధిక బరువు, రక్తహీనత,జుట్టు రాలే సమస్య, రక్తపోటు వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ఈ లడ్డులను తయారుచేసుకొని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.