1 గ్లాసు 15 రోజులు… ఆకలి మరియు తినాలనే కోరికను తగ్గించి అధిక బరువును తగ్గిస్తుంది
Oats weight Loss Drink in Telugu : అధిక బరువు సమస్య నుంచి బయట పడడానికి మనలో చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అధిక బరువు సమస్యకు ఎక్కువగా ఆకలి వేయటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే ఆకలి వేయకుండా బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. .
అధిక బరువు కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండెపోటు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు రాకుండా .ఉండాలంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి. బరువు అదుపులో ఉండాలంటే ఆకలి తగ్గాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తీసుకుంటే ఆకలి తగ్గటమే కాకుండా తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఒట్స్, ఒక స్పూను చియా సీడ్స్, గింజలు తీసిన ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మిక్సీ జార్ లో వేయాలి. ఒక స్పూన్ పీనట్ బటర్. ఒక స్పూన్ కోకో పౌడర్., రెండు స్పూన్ల పెరుగు వేయాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ సత్తు పౌడర్, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న డ్రింక్ తయారైనట్టే. ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆకలి తగ్గి తినాలనే కోరిక తగ్గుతుంది. అధిక బరువు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఉదయం సమయంలో తీసుకోవడం వల్ల నీరసం., అలసట ఏమీ లేకుండా రోజంతా హుషారుగా పనులు చేసుకుంటారు.
ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే తినాలనే కోరిక తగ్గి అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. అలాగే మనలో చాలా మంది కొంచెం పని చేసినా తొందరగా అలసిపోతారు. అలాంటి వారు కూడా ఈ డ్రింక్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. కాబట్టి ఒకసారి ఈ డ్రింక్ తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.