Healthhealth tips in telugu

Kiwi Fruit:ప్రతి రోజు 1 తింటే…కీళ్ల నొప్పులు,డయాబెటిస్,గుండె సమస్యలు జీవితంలో ఉండవు

kiwi fruit benefits in Telugu :ప్రతి రోజు1తింటే…కీళ్ల నొప్పులు,డయాబెటిస్,గుండె సమస్యలు జీవితంలో ఉండవు Kiwi Fruit ని “సూపర్ ఫుడ్” గా చెప్పవచ్చు. kiwi Fruit ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగా లభిస్తుంది. ఈ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Kiwi fruit
అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు ఈ Fruit కి దూరంగా ఉండటమే మంచిది. చాలా పుల్లగా ఉండే కివి పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ , విటమిన్ సి, విటమిన్ కె , విటమిన్ ఇ, ఫోలేట్స్ వంటి విటమిన్లు రాగి, కోలిన్ , మెగ్నీషియం, ఐరన్ , మాంగనీస్, క్లోరైడ్ మరియు ఫాస్పరస్ సమృద్దిగా ఉంటాయి.

గుండె సమస్యలు ఉన్నవారికి కివీ పండు ఒక వరం అని చెప్పవచ్చు. పొటాషియం రక్తం పలుచగా అవ్వటానికి మరియు క్లాట్ తొలగింపు ప్రక్రియలో సహాయపడి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే కివీ పండులో క్వెర్సెటిన్ అనే పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కివీలో ఆక్టినిడైన్ అని పిలువబడే ప్రోటీన్ ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణసంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే ఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రియెంట్లు DNA రక్షణకు బాధ్యత వహిస్తాయి.
Weight Loss tips in telugu
అధిక ఫైబర్ కంటెంట్ ఉండుట వలన అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మన పేగులోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. కివీలో విటమిన్ A, లుటిన్ మరియు జియాక్సంతిన్ అధిక స్థాయిలో ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కివీ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది.
Diabetes diet in telugu
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. కివిలో ఉండే ఇనోసిటాల్ అనే ఎంజైమ్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. కివి పండులో విటమిన్ కె మరియు క్యాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు,నడుము నొప్పి వంటి వాటికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ సీజన్ లో ప్రతి రోజు ఒక కివి పండు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలను తగ్గిస్తుంది. రోజుకి ఒక పండు తినవచ్చు …లేదంటే పండులో సగం తినవచ్చు. ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ