యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఉదయం ఈ కషాయం తాగితే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు
Best Ayurvedic Home Remedies To Control Uric Acid : ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా మనలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి. అలా మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే చాలా తొందరగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.
ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. peepal Bark యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
రావి చెట్టు బెరడు లేదా బెరడు పొడి…ఈ రెండూ మార్కెట్ లో లభ్యం అవుతాయి. రావి చెట్టును పూజిస్తాము. అలాగే 24 గంటలు ఆక్సిజన్ అందించే చెట్టు. ఒక గిన్నెలో 250 Ml నీటిని పోసి దానిలో 10 గ్రాముల peepal Bark ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ కాషాయన్ని ప్రతి రోజు తాగుతూ ఉంటే క్రమంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
అలాగే గోరువెచ్చని నీటిలో బ్లాక్ సాల్ట్ కలిపి కీళ్లను మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాక ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోవాలి. నల్ల మిరియాల నూనె, అజ్వైన్ నూనె, జాజికాయ నూనె, ఆలివ్ నూనె మరియు గూస్ బెర్రీ ఎసెన్షియల్ ఆయిల్…ఈ 5 నూనెలను సమానంగా తీసుకొని బాగా కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.