Yellow capsicum:పసుపు క్యాప్సికమ్ ని ఎప్పుడైనా తిన్నారా…లేదంటే ఎన్నో లాభాలను మీరు మిస్ చేసుకున్నట్లే..!
Yellow capsicum Health benefits In telugu : సాధారణంగా క్యాప్సికమ్ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో లభ్యం అవుతుంది. ఒకప్పుడు ఆకుపచ్చ క్యాప్సికమ్ మాత్రమే లభ్యం అయ్యేది. ఎరుపు, పసుపు క్యాప్సికమ్ లు కూడా ఇప్పుడు విరివిగానే లభ్యం అవుతున్నాయి. పసుపు క్యాప్సికమ్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పసుపు క్యాప్సికమ్ లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ లేకుండా కాపాడుతుంది. శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ని బయటకు పంపి శరీరాన్ని సురక్షితంగా ఉంచుతుంది. పసుపు క్యాప్సికమ్ లో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మరియు విటమిన్ సి వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
అందువల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీసే కారకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా గొంతు ఇన్ ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. పసుపు క్యాప్సికమ్ లో థయామిన్, రిబోఫ్లావిన్ మరియు విటమిన్ B6 సమృద్దిగా ఉండుట వలన ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారటంలో సహాయపడతాయి.
దీనిలో ఫోలిక్ యాసిడ్, బయోటిన్ మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అనేది అభివృద్ధి చెందుతున్న పిండంలో నాడీ లోపాలు లేకుండా చేస్తుంది. బయోటిన్ అనేది ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం మరియు గోళ్లకు అవసరం. పొటాషియం అనేది గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
దీనిలో ట్రిప్టోఫాన్ ఉండుట వలన మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్రను ప్రోత్సహించే హార్మోన్ మెలటోనిన్ అనేది ట్రిప్టోఫాన్ సహాయంతో ఉత్పత్తి అవుతుంది. అందువల్ల నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి పసుపు క్యాప్సికమ్ మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. విటమిన్ ఎ, సి మరియు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.