Weight Loss:అధిక బరువు ఉన్నవారు వేరుశనగ తింటే ఏమి అవుతుందో తెలుసా…
Peanuts Weight Loss Tips : అధిక బరువు ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు వేరుశనగ తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. వేరుశనగను సరైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
వేరుశనగలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికి రిచ్ ఫైబర్ మరియు ప్రొటీన్ కంటెంట్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని నమలినప్పుడు, అవి చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. దాంతో తక్కువ కేలరీలు అందె అవకాశం ఉంది.
వేరుశనగలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండుట వలన నిల్వ చేసిన కొవ్వును శక్తిగా ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని పెంచి బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.
వేరుశనగలు తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరికను తగ్గించి ఆకలి లేకుండా చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది, అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది.
అయితే మనలో చాలా మందికి రోజులో ఎంత మోతాదులో వేరుశనగలను తీసుకోవాలో అనే సందేహం ఉండటం సహజమే. రోజుకి రెండు స్పూన్ల వేరుశనగలను మాత్రమే తీసుకోవాలి. వేరుశనగలను నానబెట్టి తీసుకోవచ్చు…లేదంటే ఉడికించి తీసుకోవచ్చు. వేరుశనగలను వేగించి తీసుకోవటం కన్నా ఉడికించి తీసుకోవటం మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.