ప్రతి రోజు ఒక అరటి పండు తింటే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…
Banana Health benefits In telugu : అరటి పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.
అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు మరియు విటమిన్లు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం మరియు చక్కెర తక్కువగా ఉంటాయి, కాబట్టి మనం ప్రతిరోజూ రెండు అరటిపండ్లను తింటే , మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. అలాగే అరటి పండులో విటమిన్ డి3, విటమిన్ బి12, కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అంతేకాక పొటాషియం, కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతో పాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్లు, ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.
కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎక్కువగా తింటే కొన్ని సమస్యలు వస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.