ఇలా చేస్తే ఎంతటి భరించలేని తలనొప్పి,సైనస్,మైగ్రేన్ 2 నిమిషాల్లో తగ్గిపోతుంది
Headache Home Remedies in Telugu : తలనొప్పి అనేది మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. తలనొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి.
సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఫోన్ ని ఎక్కువగా వాడటం, కంప్యూటర్ ని ఎక్కువగా చూడటం వంటి కారణాలతో తలనొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి సైనస్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. మనలో చాలామంది తలనొప్పి రాగానే టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు.
అలా టాబ్లెట్ వేసుకోకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే తలనొప్పి కాస్త తక్కువగా ఉన్నప్పుడే ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఈ రెమిడీ కోసం రెండు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 4 మిరియాలను పొడిగా చేసి వేయాలి.
ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. తలనొప్పి వచ్చినప్పుడు ఈ డ్రింక్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాల పొడి మార్కెట్ లో దొరుకుతుంది. కానీ ఇంటిలోనే మిరియాలను మిక్సీలో వేసి పొడి చేసుకుంటే మంచిది.
మిరియాలు,నిమ్మకాయ తలనొప్పిని తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి ఈ ఇంటి చిట్కాను ఫాలో అవ్వండి. మిరియాలు, నిమ్మకాయలను మనం రెగ్యులర్ గా ప్రతి రోజు వాడుతూనే ఉంటాం. ఈ సీజన్ లో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు