పాలల్లో కలిపి తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది
Dry Fruit Milk In telugu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ మధ్య. కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. అలాగే ఈ మధ్య. కాలంలో డ్రై ఫ్రూట్స్ వాడకం కూడా చాలా ఎక్కువ అయింది.
డ్రై ఫ్రూట్స్ కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడు చెప్పే పాలను వారంలో రెండుసార్లు తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి సమస్యలు, మతిమరుపు సమస్యలు అనేవి అస్సలు ఉండవు. అలాగే శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ పాలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు.
రాత్రి సమయంలో ఒక బౌల్ లో ఐదు జీడిపప్పులు, ఐదు ఎండు ద్రాక్షలు, నాలుగు బాదం పప్పులు వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీ జార్ లో నానపెట్టిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయాలి. ఆ తర్వాత నానిన బాదంపప్పు తొక్క తీసి వేయాలి. ఆ తర్వాత నాలుగు పిస్తా పప్పులను వేసి కొంచెం నీటిని పోస్తూ మెత్తని పేస్ట్ గా తయారు చేసుకుని పక్కన పెట్టాలి.
ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి పాలు కాస్త వేడెక్కాక మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమము., పావు స్పూన్ యాలకులపొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత ఒక స్పూను ఆర్గానిక్ బెల్లం తురుము వేసి బాగా కలిపి ఒక నిమిషం అయ్యాక పొయ్యి ఆఫ్ చేయాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న డ్రై ఫ్రూట్స్ మిల్క్ రెడీ.
ఈ పాలను వారంలో రెండుసార్లు తీసుకుంటే ఒత్తిడి, అలసట, నీరసం వంటివి అన్నీ తొలగిపోతాయి. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి., ఆలోచన శక్తి పెరగడమే కాకుండా మతిమరుపు సమస్యలు కూడా తగ్గుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా మంచి ఫలితాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ సమృద్ధిగా అందిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.