రాత్రి పడుకునే ముందు గసగసాలు తీసుకుంటే… ఏమి అవుతుందో తెలుసా?
gasalu Health benefits in telugu :గసగసాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే కొంతమంది స్వీట్స్ తయారీలో కూడా వేస్తూ ఉంటారు.గసగసాలు వేస్తే మంచి రుచి వస్తుంది. గసగసాలు వంటల్లో వేస్తే మంచి రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. .
ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఒక గ్లాసు వేడి పాలలో గసగసాలు పేస్ట్ వేసి కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది. అంతేకాకుండా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. సీజన్ మారినప్పుడు దగ్గు జలుబు వంటివి వస్తూ ఉంటాయి.ఈ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
గసగసాలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. చిన్నపిల్లలకు గసగసాల పొడి లో నెయ్యి బెల్లం కలిపి ఇస్తే వారిలో ఆలోచించే శక్తి పెరగడమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. గసగసాలు లిమిట్ గా తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..
ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి గసగసాలను తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.