ఈ గింజలను ఇలా చేసి తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య మాయం అవుతుంది
Thyroid problem home remedy In Teluguఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య అనేది హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా వస్తుంది. ఈ వ్యాధి : వచ్చిన వారు బరువు తగ్గాలి తగ్గటం,మందులు వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సమస్యకు వ్యాయామంతో పాటు మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి. .
థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది ఇది జీవక్రియ రేటును అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే జీవక్రియలు అస్తవ్యస్తంగా మారతాయి. థైరాయిడ్ గ్రంధి తక్కువ హార్మోన్లను విడుదల చేస్తే థైరాయిజం అని, ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ అని అంటారు.
ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంటుంది.. దీనికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలిపి తాగాలి. ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
అయితే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది. ధనియాలలో ఉన్న పోషకాలు థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.