Hair Fall Tips:ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Fall Tips:ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. జుట్టుకి సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కంగారు పడుతూ ఉంటారు . అలా కంగారు పడవలసిన అవసరం లేదు . ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.
ఈ మధ్య కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలటం, చుండ్రు, జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దాంతో చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం. ఈ నూనె చాలా బాగా సహాయపడుతుంది. .
దీని కోసం రెండు అంగుళాల అల్లం ముక్కని తీసుకుని తొక్క తీసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల లవంగాలను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక కప్పు సన్ ఫ్లవర్ ఆయిల్ వేసి కాస్త వేడి అయ్యాక కచ్చాపచ్చాగా దంచిన అల్లం, లవంగాల పొడి వేసి పది నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. .
ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ ఆయిల్ దాదాపుగా నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేసి షవర్ క్యాప్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాస్త ఓపికగా శ్రద్దగా ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య అన్నీ తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టును నల్లగా కూడా మారుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.