తమలపాకుతో వాము కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Betel leaf with ajwain health benefits In Telugu : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదొక సమస్యతో బాధపడుతున్నారు. చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. తమలపాకు,వాము రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, సరైన సమయంలో భోజనం చేయక పోవటం, కాఫీ,టీలు ఎక్కువగా తాగటం,జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వంటి కారణాలతో కడుపు ఉబ్బరం,గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అధిక బరువు, శరీరంలో అదనంగా కొవ్వు పెరుకుంటుంది.
ఈ సమస్యలను తగ్గించుకోవటానికి చిట్కా తెలుసుకుందాం. ఒక తమలపాకులో పావు స్పూన్ వాము వేసి చుట్టి నోట్లో పెట్టుకొని నములుతూ ఆ రసాన్ని మింగాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తే సరిపోతుంది. తమలపాకు,వాము కలిపి తినటం వలన జీవక్రియ పెరగటమే కాకుండా గ్యాస్,కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి.
ఈ మిశ్రమం లాలాజలం ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మీ జీర్ణవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. మీ కడుపు యొక్క పెరిస్టాల్టిక్ కదలికను మెరుగుపరుస్తుంది, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతుంది. అంతేకాకుండా అధిక బరువు, శరీరంలో పెరుకున్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.