Kitchenvantalu

వారంలో 2 సార్లు ఈ సూప్‌ను తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

Weight Loss spinach soup In Telugu : ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యకు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. బరువు సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది.
Weight Loss tips in telugu
అందువలన మనం చాలా తొందరగానే అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పే సూప్ ని వారంలో రెండుసార్లు తీసుకుంటే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఈ సూప్ తయారీ కోసం ముందుగా పాలకూరను శుభ్రం కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత బంగాళాదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత క్యారెట్ ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఆ నీరు కాస్త వేడెక్కాక రెండు కప్పుల పాలకూర తరుగు, అరకప్పు బంగాళదుంప ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు వేసి బాగా ఉడికించాలి.
Potato
ఉడికిన వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకుని పక్కన పెట్టాలి. ఆ తరువాత స్టవ్ పై గిన్నె పెట్టి ఒక స్పూన్ నూనె వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. ఆ తర్వాత మిక్సీ చేసి తయారు చేసి పెట్టుకున్న పేస్టు వేయాలి.

ఆ తర్వాత అరకప్పు నీటిని అర స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికిస్తే పాలకూర సూప్ రెడీ. ఈ సూప్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు అంతా కరిగిపోయి బరువు తగ్గుతారు. అలాగే తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. .

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి బెస్ట్ సూప్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో పాలకూర చాలా విరివిగా లభ్యమవుతుంది. కాబట్టి ఈ సూప్ తయారు చేసుకొని తాగి అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా సీజనల్ గా వచ్చే సమస్యలను కూడా తగ్గించటానికి ఈ సూప్ చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.