యాలకుల టీ తాగుతున్నారా… ఈ విషయం తెలిస్తే ప్రతి రోజు తాగుతారు
Elaichi Tea Benefits in telugu: యాలకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలా దినుసుగా యలకులను వాడుతూ ఉంటాం. యాలకులను స్వీట్, హార్ట్ రెండింటిలోను వేస్తుంటారు. యాలకులు వంటలకు మంచి రుచి,వాసన అందిస్తాయి. ప్రతి రోజు యాలకుల టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ ప్రయోజనాలు తెలిస్తే యాలకుల టీ తాగని వారు కూడా తాగటం అలవాటుగా చేసుకుంటారు.ప్రతి రోజు పనులను చేసుకున్నప్పుడు సాదరణంగా ఒత్తిడి,అలసట,తలనొప్పి వంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కామన్ గా టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. టాబ్లెట్ వేసుకోకుండా ఒక కప్పు యాలకుల టీ తాగితే ఒత్తిడి తలనొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ చలి కాలంలో తరచుగా జలుబు దగ్గు, గొంతు నొప్పి వంటివి వేధిస్తూ ఉంటాయి. రోజుకి ఒక కప్పు యాలకుల టీ తాగితే చలికాలంలో వచ్చే సమస్యలు అన్ని దూరం అవుతాయి. నోటి దుర్వాసన సమస్య నుంచి కూడా బయటపడొచ్చు.జీర్ణ సంబంధ సమస్యలు అయినా గ్యాస్ ఎసిడిటీ కడుపుబ్బరం మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి .
అయితే మామూలుగా యాలుకల టీ ని ఉదయం తాగవచ్చు. అదే జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం చేయటానికి గంట లేదా రెండు గంటల ముందు తాగాలి. అప్పుడు మంచి ఫలితం వస్తుంది. యాలకుల టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా. కాబట్టి టీ తయారుచేసినప్పుడు ఒక elaichi వేస్తే సరిపోతుంది.
యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు సమృద్దిగా ఉండుట వలన వాపు,కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.