Hair Care Tips:వారంలో 2 సార్లు వాడితే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది
Carrot Hair Control Home Remedies In telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వచ్చేస్తుంది. ఈ సమస్యలు రావటానికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడటం, కాలుష్యం, ఒత్తిడి, జుట్టుకి సంరక్షణ చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
ఈ సమస్య రాగానే మనలో చాలామంది ఖరీదైన నూనెలను, షాంపూలను వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. దాంతో చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా చేసుకోవాలి.
క్యారెట్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి జ్యూస్ ను సపరేట్ చేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కని తీసుకుని తొక్క తీసి సన్నగా తురుముకుని పక్కన పెట్టాలి. ఈ తురుము నుండి అల్లం జ్యూస్ సెపరేట్ చెయ్యాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 10 .స్పూన్ల క్యారెట్ జ్యూస్, 5 స్పూన్ల అల్లం జ్యూస్, రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.