రోజుకి ఒక్క లడ్డు త్వరగా బరువు తగ్గాలన్నా, జుట్టు బాగా పెరగాలన్నా,ఎముకలు గట్టిపడి, జ్ఞాపకశక్తి కోసం
protein laddu Health benefits In telugu : ఈ రోజుల్లో సమస్యలు వస్తే తొందరగా తగ్గటం లేదు. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం ఇంటిలోనే పరిష్కారం చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కాబట్టి అధిక బరువు సమస్య తగ్గటానికి, ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండటానికి, జుట్టు రాలే సమస్య తగ్గటానికి ఒక లడ్డు గురించి తెలుసుకుందాం.
దీని కోసం పాన్ పెట్టి ఒక కప్పు ఆవిసే గింజలను వేగించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు వేరుశనగ గుళ్లను వేగించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు నువ్వులను వేగించుకోవాలి. బాగా వేగిన ఆవిసే గింజలు, నువ్వులు, వేరుశనగ గుళ్లను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంను తీగ పాకం పట్టి దానిలో ఆవిసే గింజలు,నువ్వులు,వేరుశనగ గుళ్ళ పొడిని వేసి బాగా కలిపి లడ్డులుగా చేసుకోవాలి.
ఈ లడ్డులు దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు ఒక లడ్డు తినవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఈ లడ్డు తినటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఉండవు. వేగిన ఆవిసే గింజలు, నువ్వులు, వేరుశనగ గుళ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లడ్డు తింటే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా సీజనల్ వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాబట్టి రోజుకి ఒక లడ్డు తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.