ఈ పొడిని ఇలా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య జీవితంలో ఉండదు
Wheat Grass Health benefits In Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పొడిని వాడితే చాలా తొందరగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
చాలా తక్కువ ఖర్చులో రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య నుండి బయట పడటానికి గోధుమ గడ్డి చాలా బాగా సహాయపడుతుంది. గోధుమ గడ్డిని ఇంటిలో పెంచుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో గోధుమ గడ్డి పొడి దొరుకుతుంది. ఈ పొడిని ఉపయోగించి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు.
ఉదయం త్రాగే వెజిటేబుల్ జ్యూస్ లో ఒక స్పూన్ గోదుమ గడ్డి పొడిని కలిపి తాగవచ్చు. అలా కాకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి,అరస్పూన్ ఎండు ఖర్జూరం పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఖర్జూరం పొడి లేకపోతే ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే తేడా కనపడుతుంది. ఇలా తాగటం వలన ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు
గోధుమ గడ్డిలో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, సి , ఇ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండటంతో రక్తం శుద్ధి కావడమేగాకుండా… రక్తం పెరుగుదలకు తోడ్పడుతుంది.యాంటీ యాక్సిడెంట్లు గోధుమ గడ్డిలో ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.
అలాగే శరీరంలో చురుకుదనాన్ని పెంచుతుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉండటం వలన శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అలర్జీలు రాకుండా, అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను అరికట్టేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.