Healthhealth tips in telugu

ఖర్జూరం,తేనె కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…ఈ సీజన్ లో…

Date Fruits With Honey Benefits In telugu : ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో కూడా ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గాజు సీసాలో మూడు వంతులు తేనెను పోసి దానిలో ఒక వంతు గింజ తీసిన ఖర్జూరం వేసి బాగా కలపాలి.
Health Benefits of Dates
బాగా కలిపిన తర్వాత మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. ఇలా తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తింటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే గ్యాస్,ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
Brain Foods
కాల్షియం, ఐరన్‌ సమృద్దిగా ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేసి మెమొరీ పవర్ పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు ఉండవు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఈ సీజన్ లో వచ్చే ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
Joint Pains
ఈ కాలంలో దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా తేనె,ఖర్జూరం తీసుకోవాలి. ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం,నిసత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. వీటిని తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.

వారంలో మూడు సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే మన శరీరానికి అవసరం అయినా పోషకాలు అంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. రాత్రి పడుకొనే ముందు తీసుకుంటే నిద్రలేమి సమస్య లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.