1 లడ్డు తింటే ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు…మహిళలు మిస్ కావద్దు
RAGI WALNUT LADDOO In Telugu: ప్రతి మహిళ మాతృత్వంను ఆస్వాదిస్తుంది. అలాగే ప్రసవం తర్వాత ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుంచి కూడా బయటపడటానికి మంచి పాషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రసవం అయ్యాక రక్తహీనత, నీరసం, అలసట వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ రోజు ఒక లడ్డు తయారు చేసుకుందాం. ప్రసవం తర్వాత ప్రతి రోజు ఒక లడ్డు తీసుకుంటే సాధారణంగా వచ్చే సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ లడ్డును తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా ఈ లడ్డును తయారు చేసుకుని ప్రతి రోజు తింటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది.
ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు వాల్నట్స్ వేసి మంచి వాసన వచ్చేవరకు వేగించాలి. ఇలా వేగించిన వాల్నట్స్ ని కాస్త చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరల అదే పాన్ లో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి ఒకటిన్నర కప్పుల రాగి పిండి వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి మీద మరొక గిన్నెను పెట్టి ఒక కప్పు బెల్లం తురుము, కొంచెం నీటిని పోసి ఏడు నుంచి పది నిమిషాల వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన బెల్లం సిరప్ లో వేగించి పెట్టుకున్న వాల్నట్స్ ముక్కలు, వేగించి పెట్టుకున్న రాగి పిండి, అర స్పూన్ యాలకుల పొడి వేయాలి. అన్ని బాగా కలిసేలా కలిపి చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసుకోవాలి.
ఈ లడ్డులు దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ లడ్డు పెరిగిన బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. అలాగే వదులుగా మారిన కండరాలు బిగుతుగా మారతాయి. ఎముకలు బలంగా,ఆరోగ్యంగా మారి ఏమైనా నొప్పులు ఉన్నా తగ్గుతాయి. సాదరణంగా ప్రసవం తర్వాత వచ్చే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.