3 రోజులు వాడితే చాలు పుచ్చు పళ్ళు,నోటి దుర్వాసన లేకుండా పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి
Tooth Problem Home Remedies : ఈ రోజుల్లో దంతాల సంరక్షణ మరియు దంతాల పరిశుభ్రత కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. మార్కెట్ లో దొరికే రకరకాల పేస్ట్ లను కొని వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా దంత సమస్యలను తగ్గిస్తుంది.
ప్రతి రోజు రాత్రి పడుకోవటానికి ముందు ఒక స్పూన్ తేనెను నోట్లో పోసుకొని బాగా చప్పరిస్తూ మింగాలి. ఈ విధంగా చేయటం వలన తేనెలో ఉండే యాంటీ బయోటిక్ లక్షణాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దాంతో నోటిలో పాచి తగ్గటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. పళ్ళు పుచ్చకుండా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.
తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది. మన ఆహారపు అలవాట్లు కూడా మన దంతాల మీద ప్రభావాన్ని చూపుతాయి. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు,చాక్లెట్స్,ఐస్ క్రీమ్స్ వంటివి తిన్నప్పుడు ఇవి పంటి మధ్య ఇరుక్కుపోయి సరిగా శుభ్రం కాక బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. ఇటువంటి ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలో నీరు పోసుకొని పుక్కిలించాలి.
ఈ విధంగా చేస్తూ తేనెను రాత్రి సమయంలో తీసుకుంటే పంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాను ఫాలో అవ్వండి. చాలా తక్కువ ఖర్చులో సమస్య తీరిపోతుంది. దంతాల ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.