ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Health benefits of Peaches In Telugu : పీచ్ ఫ్రూట్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండును పీచ్ ఫ్రూట్, స్టోన్ ఫ్రూట్, పర్షియన్ యాపిల్ అనీ అంటారు. వీటిలో కొన్ని తెల్లటి గుజ్జుతో ఉంటే కొన్ని పసుపు రంగు గుజ్జుతో ఉంటాయి. పసుపు వాటి కంటే తెల్లవి ఎక్కువ తియ్యగా ఉంటాయి. లోపలుండే విత్తనం అచ్చంగా బాదం పప్పులా ఉంటుంది.
ఈ పండ్లను కాస్మొటిక్ తయారీలోనూ వాడతారు. లోషన్లు, క్రీములు, షాంపూలు, పెర్ఫ్యూమ్ ల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ పండ్లలో ఎ, సి, ఇ విటమిన్లు అధికం. పొటాషియం,కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ మరియు ఇతర సంక్లిష్ట విటమిన్లు వంటి సూక్ష్మ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ పండ్లలో సోడియం అసలు ఉండదు.
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన…అలాగే విటమిన్ ఏ,సి,E ఉండటం వలన చర్మ ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది.
జీర్ణ .సంబంద సమస్యలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలలో సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్., కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇది ఒక డిటాక్స్ పండు అని చెప్పవచ్చు.
మూత్రపిండాలు మరియు మూత్రశయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పండులో బయో యాక్టివ్ సమ్మేలనాలు సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ పండులో పోల్ఫెనాల్ సమృద్దిగా ఉండుట వలన రక్త ప్రసరణను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
అలాగే ఫైబర్, విటమిన్ సి మరియు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. Peach Fruit లో లుటిన్ మరియు జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన దృష్టిని మెరుగుపరచడంలో సహాయ పడటమే కాకుండా కంటి నరాలు దెబ్బతినకుండా కూడా రక్షిస్తుంది.
ఈ పండు బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి నియంత్రణలో ఉండి తినాలనే కోరికను తగ్గించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. కాబట్టి ఈ పండ్లను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.