Dates benefits:రోజు ఒక ఖర్జూరం తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…
How Many Dates Should Eat Per Day In telugu : చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారాల్లో ఖర్జూరం ఒకటి. రోజూ ఒక ఖర్జూరం తినడం వల్ల శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. శరీరాన్ని అంతర్గతంగా వెచ్చగా మరియు శక్తివంతంగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఖర్జూరంలోని చాలా కేలరీలు కార్బోహైడ్రేట్ల నుండి వస్తాయి.
ప్రొటీన్లు చాలా తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, ఖర్జూరంలో ఫైబర్ అలాగే కొన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయ పడతాయి. సీజనల్ గా వచ్చే సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగు కదలికలను మెరుగుపరచి జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. అంతేకాక కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. వ్యాయామానికి ముందు ఖర్జూరం తింటే శక్తి స్థాయిలు పెరుగుతాయి. కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
ఖర్జూరం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి ఉండవు. ఖర్జూరాలు మంట లక్షణాలను తగ్గించడంలో సహాయ పడతాయి. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో ముఖ్యమైనది మెదడులో మంటను తగ్గించడానికి మరియు ఫలకం ఏర్పడకుండా నిరోధించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి.
ఖర్జూరంలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఆందోళన,ఒత్తిడి వంటి సమస్యలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఖర్జూరం జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సంస్య ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు ఒక ఖర్జూరం తింటే సరిపోతుంది. రోజువారీ ప్రేగు కదలికలు సక్రమంగా ఉంటాయి. అంతేకాకుండా పేగు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.