Healthhealth tips in telugu

ఈ మూలికలో ఊహించని ప్రయోజనాలు ఎన్నో…ముఖ్యంగా ఈ సీజన్ లో

Mulethi Health Benefits In Telugu : అతి మధురం అనేది పురాతన మూలిక. ఆయుర్వేదంలో అశ్వగంధను ఎలాగైతే ఎక్కువగా ఉపయోగిస్తారో. అలాగే అతిమధురంని కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు. తియ్యని రుచిలో ఉండే ఈ మూలికలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అతి మధురం వేరును ఎండబెట్టి పొడిగా చేస్తారు.
Mulethi benefits
మనకు మార్కెట్ లో అతి మధురం వేరు లేదా పొడి రెండూ లభ్యం అవుతాయి. చలి కాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఎంజైమ్‌లు మాక్రోఫేజ్‌లు మరియు లింఫోసైట్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడతాయి.

శరీరంలో ఎలర్జీలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు,వాపులను తగ్గించటానికి సహాయపడతాయి. శ్వాస సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. గాయకులు తమ గాత్రాన్ని మెరుగుపరుచు కోవటానికి వాడుతూ ఉంటారు. ఉబ్బసం, దగ్గు, ఆయాసం,గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది.

అలాగే వీటిలో ఉండే లక్షణాలు చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కలిపి, ఇది చర్మపు దద్దుర్లు మరియు పిగ్మెంటేషన్ వంటి అనేక చర్మ వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఒత్తిడి,ఆందోళన వంటివి ఉన్నప్పుడూ అతి మధురంను తీసుకుంటే చాలా ప్రశాంతత కలుగుతుంది.
cholesterol
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి మరియు శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఈ మూలికలో గ్లయిసిరైజిక్‌ యాసిడ్, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, యాస్పిరాజిన్, ఈస్ట్రోజెన్‌, స్టిరాయిడ్‌, సుగంధిత తైలం వంటివి ఉంటాయి. సీజనల్ గా వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.