Healthhealth tips in telugu

ఈ ఆకును ఎప్పుడైనా తిన్నారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Radish Leaves Health benefits In telugu : ఈ సీజన్ అంటే చలికాలంలో విపరీతమైన మంచు ఉంటుంది. అందువల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే మంచి పోషకాలు ఉన్న ఆహారం తినటానికి ప్రయత్నం చేయాలి. ముల్లంగిని కూరగా చేసినప్పుడు మనలో చాలా మంది ఆకులను పాడేస్తూ ఉంటారు.

అలా పాడేసే ఆకులలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ముల్లంగి ఆకులలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, ఫాస్పరస్, ఐరన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. ముల్లంగి ఆకులతో జ్యూస్ చేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
gas troble home remedies
దీనిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీనిలో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ముల్లంగి ఆకులలోని సోడియం శరీరంలో ఉప్పు కొరతను తీర్చి.. బీపీని నివారిస్తుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఐరన్ సమృద్దిగా ఉండుట వలన హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పైల్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సి, విటిమన్ ఎ, థైమిన్ వంటివి అలసటను,నీరసంను తగ్గిస్తుంది.
Joint Pains
ముల్లంగి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, నొప్పులు, వాపులున్న జాయింట్స్ లో అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, నొప్పులు, వాపులు తగ్గుతాయి. మూడు ముల్లంగి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి మరోసారి మిక్సీ చేసి వడకట్టి తాగాలి.
radish beenfits
కాబట్టి ఈ సీజన్ లో మంచి పోషకాలు ఉన్న ఇలాంటి ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ సీజన్ లో ముల్లంగి కూడా చాలా విరివిగా లభ్యం అవుతుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి ఆహారాలను తీసుకొని మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.