మీ శరీరంలో రక్తాన్ని ఎంతలా పెంచుతుందంటే… రక్తహీనత,నీరసం,అలసట అనేవి జీవితంలో ఉండవు
Anemia home remedies in ayurveda In Telugu: మారిన జీవనశైలి పరిస్థితులు మరియు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతున్నారు. అలాగే పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రక్తహీనత సమస్య తగ్గించుకోవటానికి మంచి రెమిడీ తెలుసుకుందాం. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
దీని కోసం కేవలం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 2 అంజీర్ లు, 5 నల్ల ఎండు ద్రాక్ష వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం నానిన శనగలు, అంజీర్, నల్ల ఎండు ద్రాక్ష తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా 15 రోజులు చేస్తే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు.
ఈ మూడింటిలోనూ ఐరన్ సమృద్దిగా ఉంటుంది. వీటిని ఉదయం సమయంలో తినవచ్చు లేదా సాయంత్రం సమయంలోనైనా తినవచ్చు. సాయంత్రం సమయంలో తినాలంటే ఉదయం సమయంలో నానబెట్టాలి. రక్తహీనత సమస్యకు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇలా ఇంటి చిట్కా ఫాలో అయితే బాగా పనిచేస్తుంది.
అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానిలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం, నిసత్తువ లేకుండా రోజంతా ఉషారుగా ఉంటారు. శనగలను పేదవాని బాదం అని అంటారు. శనగల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.