2 సార్లు జుట్టు రాలే సమస్య తగ్గి పలచగా ఉన్నజుట్టు చాలా ఒత్తుగా,పొడవుగా,నల్లగా మారటం ఖాయం
Lemon Hair Fall Tips In telugu : ప్రస్తుతం మారిన కాలంలో మనలో చాలా మంది చుండ్రు, జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.
ఒక స్పూను మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టాలి. ఈ మెంతుల నీటిలో రెండు స్పూన్ల కాఫీ పొడి., రెండు స్పూన్ల వేపాకు పొడి, అర చెక్క నిమ్మరసం, ఒక స్పూను కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తూ ఉంటే చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫెన్ జుట్టు రాలకుండా చేయడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. .
వేపాకులో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. వేప పొడికి బదులుగా వేపాకు తాజాగా దొరికితే వేపాకులను పేస్ట్ గా చేసి కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసం చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టు పొడిగా మారకుండా సహాయపడుతుంది.
కాస్త ఓపిక ఇంటి చిట్కాలను చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రెమిడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రెమిడీ ఫాలో అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు, తెల్ల జుట్టు సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.