యాంకర్ రవి మొదటి పారితోషికం ఎంతో తెలుసా…అసలు నమ్మలేరు
Anchor Ravi First remuneration In Telugu : ఫీమేల్ యాంకర్స్ లో సుమ ఎంతటి పాపులార్టీ తెచ్చుకుందో మేల్ యాంకర్స్ లో రవి కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. 2010లో మా మ్యూజిక్ టీవీలో లవ్ జంక్షన్ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రవి ఆతర్వాత వరుస షోస్ తో బిజీ అయ్యాడు.
ఈమధ్య ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ, తొలిసారి లైవ్ షోలో ఎపిసోడ్ కి 250రూపాయలు తొలి పారితోషికంగా అందుకున్నానని చెప్పాడు. క్రికెటర్ అవ్వాలని కోరుకున్నప్పటికీ కాలేకపోయానని యాంకర్ రవి చెప్పాడు. అయితే రవితో పాటు అతడి భార్య నిత్యా సక్సేనా, కూతురు లియాతో కల్సి యూట్యూబ్ లో సందడి చేసిన ఇంటర్యూ వైరల్ అయింది.
ఒక్కో ఎపిసోడ్ కి 250చొప్పున నెలలో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తే,అన్ని 250లు వచ్చేవని యాంకర్ రవి గుర్తుచేసుకున్నాడు. ఇక తన భార్య నిత్యా బిటెక్ థర్డ్ ఈయిర్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ తెచ్చుకుందని చెప్పాడు. అప్పట్లో నిత్యా నెలకు 22వేల 500సంపాదించేదని యాంకర్ రవి చెప్పాడు. తన భర్త తన దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటానని నిత్యా చెప్పుకొచ్చింది.
ఎన్నో షో లకు యాంకరింగ్ చేస్తూ రవి చాలా బిజీగా ఉన్నాడు. యాంకర్ రవికి ఎంతో మండి అభిమానులు ఉన్నారు. అభిమానులు తమ అభిమాన యాంకర్ గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు. వారి గురించి ఏ న్యూస్ వచ్చిన చూడటానికి ఆసక్తి చూపుతారు.