10 ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం మంచిది…ఎందుకో తెలుసా…?
Jamakaya Health benefits In Telugu :జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది. ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు. అందులోనూ జామకాయ ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్ అంటారు పోషకాహారనిపుణులు చెప్పుతున్నారు.
అలా ఎందుకు చెప్పుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆపిల్‌తో పోలిస్తే జామపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తరుచూ జామకాయలను తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కమలాపండుతో పోల్చి చూసినా జామపండులో ఐదు రెట్లు అధికంగా విటమిన్-సి ఉంటుంది. కిలో ఆకుకూరలో కంటే రెండింతల పీచుపదార్థం కిలో జామపండ్లలో లభిస్తుంది.
ఇంకా జామలో కొవ్వు, కేలరీలు తక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. జామకాయ పచ్చిగా, దోరగా, పండుగా ఎలా ఉన్నా చిన్నవారి దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ యిష్టంగా తినగలిగే కాయ జామకాయ. ఇది ఉష్ణమండల ప్రాంతమైన ఆసియా దేశాలలో ఎక్కువగా పండుతుంది.
ఆకుపచ్చ రంగు తోలు కలిగి ఉంటుంది. బాగా పండినప్పుడు పండు పసుపు వర్ణంలోకి మారుతుంది. తొక్క లోపల కండ గులాబీరంగులో కానీ, తెలుపురంగులో కానీ,ఎరుపులో కాని ఉంటుంది. జామకాయ లేదాపండును తినటం వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ప్రధానంగా జామకాయలో విటమిన్‌లు, పీచు, మినరల్స్‌సమృద్దిగా ఉన్నాయి.
ఈ కాయల్లోని పీచు కారణంగా కొలెస్ట్రాల్, బిపి తగ్గుతాయి. బరువు తగ్గడానికి జామ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దాంతో పొట్ట త్వరగా నిండిపోతుంది. ఆకలి వేయడానికి సమయం పడుతుంది. రోజు ఓ దోర జామపండు తింటే డయాబెిస్ నియంత్రణలో ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే డయబెటిస్ ఉన్నవారికి జామకాయ ఒక వరం అని చెప్పాలి. జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవెల్స్‌ను బాగా తగ్గించుకోవచ్చని, ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించి బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తుందని డాక్టర్లు, న్యూట్రిషన్లు చెప్తున్నారు. పేగుల్లోని అధికంగా ఉన్న మ్యూకస్‌పొరను తొలగించి రక్తవిరేచనాలు తగ్గిస్తుంది.
మలబద్దకంతో బాధపడేవారికి, జామకాయలోని ఎక్కువగా ఉండే పీచుపదార్థాల వల్ల ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుంది. అంతేకాక కడుపులోని మలినాలను,అంటు వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిములను తొలగిస్తుంది.జామపండులో వున్న విటమిన్ ఎ, సిలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఇక దంతాల నొప్పికి,గొంతునొప్పి,చిగుళ్ల వ్యాధులను జామకాయలను నమలడం ద్వారా దూరం చేసుకోవచ్చు. పూర్వం జామ పుల్లలతో పళ్లు తోముకునేవారట. దానివలన చిగుళ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు తగ్గుతాయని మన పెద్దలు చెప్తారు.
అంతే కాదు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్తారు. ఎసిడిటి,కీళ్లనొప్పులు తగ్గించడానికి, థైరాయిడ్ నుంచి రక్షించడానికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది. జామకాయ జ్యూస్ కాలేయానికి కూడా ఒక మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది.
జామకాయ శరీరంలో సోడియం,పొటాషియం కంటెంట్ బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేయడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జామకాయలో విటమిన్స్, మినరల్స్ వంటి వివిధ రకాల న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి .ఇవి మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. మజిల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.