Healthhealth tips in teluguKitchen

రాత్రి సమయంలో ఈ డ్రింక్ తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు

Insomnia Home Remedies in telugu : నేటి ఆధునిక కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులతో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య అనేది చాలా చిన్న సమస్యగా కనబడిన… దానిని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో రకాల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. .
sleeping problems in telugu
నిద్ర సరిగా లేకపోతే నీరసం, అలసట, ఒత్తిడి, చిరాకు వంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే నిద్రలేమి కారణంగా రక్తపోటు అదుపు తప్పడం., మెదడు పనితీరు మందగించడం, గుండెపోటు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందువలన నిద్రలేని సమస్యను వీలైనంతవరకు చాలా తొందరగా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
Apricot Health Benefits in telugu
ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే నిద్రలేమి సమస్య అసలు ఉండదు. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగితే సరిపోతుంది. ఒక అరటిపండును తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు అప్రికాట్స్, ఒక అంజీర్, ఒక్క స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్ వేసి నీటిని పోసి ఒక గంట నానబెట్టాలి.
Banana Benefits
ఒక బ్లెండర్ తీసుకుని దానిలో నానబెట్టిన అన్ని పదార్థాలు మరియు కట్ చేసి పెట్టుకున్న అరటి ముక్కలు, ఒక గ్లాసు గోరువెచ్చని బాదంపాలు పోసి గ్రైండ్ చేసుకుంటే డ్రింక్ రెడీ అవుతుంది. ఈ బనానా డ్రై ఫ్రూట్ డ్రింక్ ను రాత్రి సమయంలో తీసుకుంటే నిద్రలేమి సమస్య ఉండదు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
Fig Fruit Benefits in telugu
అలాగే ఈ డ్రింక్ ను ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా చాలా హుషారుగా ఉంటారు. ఈ డ్రింక్ లో మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలును చేస్తాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకుంటే చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.