Tollywood:జయం సినిమాలో హీరోయిన్ “సదా” కి ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా ?
Telugu actress sada : టాలీవుడ్ లో ఎంతో మంది హీరో, హీరోయిన్ లు ఉన్నారు. వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. అభిమానులు తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అలా హీరోయిన్ సదాకి జయం సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
తేజ దర్శకత్వంలో జయం సినిమాలో హీరో హీరోయిన్లుగా నితిన్, సదా నటించారు. నితిన్ కి మొదటి సినిమా అయిన జయం సూపర్ డూపర్ హిట్ అయింది. సదాకి కూడా ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అవకాశం మొదట సదా కి కాకుండా స్వర్గీయ నటి ప్రత్యూష వచ్చిందట. అయితే అనుకోకుండా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ అవకాశం సదాకి వచ్చింది.
ఈ విషయం గురించి ప్రత్యూష తల్లి యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జయం సినిమాలో అవకాశం వచ్చినా ఇలా జరుగుతుందని కలలో అనుకోలేదని ప్రత్యూష తల్లి ఎమోషనల్ అయ్యారు. జయం హిట్ అయినా సదా సరైన అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె డాన్స్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.