Healthhealth tips in telugu

గుడ్డు పచ్చసొన మరియు తెల్లసొన… ఆరోగ్యానికి ఏది మంచిది… నమ్మలేని నిజాలు

Egg white and egg Yellow Benefits In telugu : Egg లో పోషకాలు ఎక్కువగా ఉంటాయని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమంది Egg ని పచ్చిగా తింటారు… మరి కొంతమంది ఉడికించి తింటారు. ఉడికించిన కోడిగుడ్డులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనకు తెలిసిన విషయమే. అందువల్ల ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తింటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అది ఏమిటంటే గుడ్డులో తెల్ల సోన తింటే మంచిదా లేక పచ్చ సొన తింటే మంచిదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మాములుగా అయితే గుడ్డును ఉడికించి అలానే తినేస్తాం. ఆలా తింటే ఆరోగ్యానికి మంచిదేనా? అసలు గుడ్డులో తెల్లసొన,పసుపు సోన ఏది తింటే మంచిది.
Egg Benefits
మన ఆరోగ్యానికి ఏది ఎక్కువగా సహాయపడుతుంది. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తెల్లసొన,పచ్చ సొనలో ఉన్న పోషక విలువల గురించి వివరంగా తెలుస్కుందాం. గుడ్డు తెల్లసొన లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే తెల్లసొనలోనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే, పసుపు సొనలో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.
Egg Yellow
గుడ్డు తెల్లసొనలో కేవలం 16 కాలరీలు ఉంటాయి, కాని పసుపుసొనలో 54 కాలరీలు ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. కానీ పచ్చసొనలో 211 ఉంటుంది. గుడ్డు తెల్లసొనలో పొటాషియం, సోడియం,రిబో ఫ్లవిన్ ఎక్కువగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కాల్షియం,పాస్పరస్,జింక్,సేలేనియం, థియామిన్, ఫోలేట్, బి 12,విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.
Weight Loss tips in telugu
ఈ పోషక విలువలను బట్టి చూస్తే మన ఆరోగ్యానికి గుడ్డు తెల్లసొన,పచ్చసొన రెండు ముఖ్యమే. కానీ సాధారణంగా డాక్టర్స్ గుడ్డు పచ్చసొన తినవద్దని చెప్పుతారు. ఎందుకంటే పచ్చసొనలో కొలస్ట్రాల్,కేలరీలు ఎక్కువగా ఉండుట వలన వాడని అంటారు. అధిక బరువు ఉన్నవారు అయితే గుడ్డు తెల్లసొన తీసుకుంటే సరిపోతుంది. అయితే ఎవరు పచ్చసొన తీసుకోవాలా అనేది వారి డైట్ ప్రకారం ఆధారపడి ఉంటుంది.
Egg Benefits In Telugu
ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు గుడ్డు మొత్తం తినేయవచ్చు. వారం రెండు మూడు రోజులు మాత్రమే పూర్తీ గుడ్డుని తిని, మిగితా రోజులు కేవలం గుడ్డు తెల్లసొన తింటే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి Egg తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ Egg తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.