Krishna అల్లూరి సీతారామరాజు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో… ?
Super Star Krishna alluri sitarama raju movie : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో వెరీ స్పెషల్ మూవీ అనగానే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంది. కృష్ణ వందవ సినిమాగా ఇది తెరకెక్కింది. తెలుగులో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిన అల్లూరి సీతారామరాజు . 1974 మే 1న విడుదల అయింది.
ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షోకే సూపర్‌హిట్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమాకు ఆదినారాయణ రావు అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ముఖ్యంగా తెలుగువీర లేవరా పాటకు తొలిసారిగా జాతీయ స్థాయిలో అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ గేయ రచయతగా శ్రీశ్రీ కి అవార్డు వచ్చింది. ‘అసాధ్యుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఓ నాటకంలో కనిపిప్తారు.
ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేసిన వి.రామచంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం 70 షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర దర్శకుడు వి.రామచంద్రరావు అకాల మరణం చెందారు. దీంతో మిగిలిన సినిమాను యాక్షన్ సీన్స్‌ను కే.యస్.ఆర్. దాస్ తెరకెక్కించారు. అంతకు ముందు వి.రామచంద్రరావు ఎన్టీఆర్,కృష్ణలతో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాను తెరకెక్కించారు.
సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితంలో 350 పైగా సినిమాలు చేసినా.. అందులో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాక హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చారిత్రక చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ముందుగా ‘అల్లూరి సీతారామరాజు ’సినిమాను ఎన్టీఆర్ చేయాలని ఎన్నో రోజులుగా అనుకున్నారు. కథ అందించిన రాజమండ్రికి చెందిన పడాల రామారావుతో భేటీ అయి చర్చించారు కూడా.
ఎందుకో ఆయన తీయలేకపోయిన తరుణంలో కృష్ణ ముందుకొచ్చి అదే కథతో ధైర్యంగా తీశారు. నిజానికి అందరి కంటే ముందుగా ఓ నిర్మాత శోభన్ బాబు హీరోగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయించారు. కానీ అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని కృష్ణకు రాసిపెట్టి ఉంది. అయితే ఆ పాత్రపై ఎన్టీఆర్ కి మక్కువ పోలేదు. అందుకే సర్ధార్ పాపారాయుడు, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాల్లోని పాటల్లో ‘అల్లూరి సీతారామరాజు’గా ఎన్టీఆర్ కనిపించి సందడి చేసారు.
ఇక అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ స్టార్ తన స్వీయ నిర్మాణ సంస్థ పద్మాలయ సంస్థపై నిర్మించారు. ఈ సినిమా కోసం త్రిపురనేని మహారథితో ఆరుగురి సభ్యులను మన్యం ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రెడీచేయించారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు త్రిపురనేని మహారథి అద్భుతమైన మాటలు రాసారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి.
ఎన్నో సినిమాల్లో ఆ సన్నివేశాలను పెట్టుకున్నారు.ఈ సినిమా షూటింగ్ చింతపల్లి అడవుల్లో చిత్రీకరించారు. ఇక ఇన్‌డోర్ సన్నివేశాలను వాహినీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేసారు. చింతపల్లి అడవుల్లో 38 రోజుల పాటు ఔట్ డోర్ షూట్ చేసారు. ఇప్పటికీ అల్లూరి పాత్రకు డిమాండ్ ఉంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ లో సీతారామరాజు గెటప్ కూడా జక్కన్న పెడుతున్నాడు.