Megastar chiranjeevi అందుకున్న తొలి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే
Megastar chiranjeevi first remuneration : మన హీరోలకు, హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వారి గురించి ఎ విషయం తెలిసిన కూడా వదిలిపెట్టకుండా చూస్తారు. అలాంటి విషయాలలో మెగాస్టార్ గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కి గల ఫాలోయింగ్ , మార్కెట్ విలువ మామూలు రేంజ్ లో ఉండదు.
ఈయన డేట్స్ ఇస్తే చాలు అంటూ వేచి చూస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లు కూడా ఇవ్వడానికి కూడా చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. అలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఇండియాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో కూడా కావడం విశేషం. బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. అప్పట్లో ఆపద్భాందవుడు సినిమా కోసం ఈయన కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు.
ఆ తర్వాత వరసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన చిరంజీవి మిగిలిన హీరోలు కోటి రేంజ్‌కు వచ్చేసరికి ఈయన రేంజ్ ఐదింతలు అయింది. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుసా? అసలు ఈయన తొలి సినిమాకు ఎంత తీసుకున్నాడనేది ఎవరికైనా తెలుసా..? తొలి రోజుల్లో డబ్బుల కంటే కూడా ఓ అవకాశం వస్తే బావుణ్ణు అని చిరంజీవి బ్యాచ్ ఆత్రంగా ఎదురు చూసేవాళ్లు.
అప్పట్లో చాలా మంది పారితోషికం కంటే ఛాన్స్ లకు విలువ ఎక్కువ ఇచ్చేవారు. ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు. అలాగే చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్లు. అయితే ముందు విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా. ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు.
కానీ చిరు నటించిన మూడో చిత్రం మనవూరి పాండవులు సినిమాకు మాత్రం అప్పట్లో 1,116 రూపాయల పారితోషికం అందుకున్నాడు. కృష్ణంరాజు ఈ సినిమాలో హీరో. ఐదుగురు స్నేహితుల బ్యాచ్‌లో చిరంజీవి కూడా ఉంటాడు. అలా తొలిసారి పారితోషికం అందుకున్న చిరంజీవి చాలా ఆనంద పడ్డాడట. అందుకే పాతరోజులు మర్చిపోకుండా చిరంజీవి తన లైఫ్ స్టైల్ ని సింపుల్ గా సాగిస్తున్నారు.